calender_icon.png 10 October, 2025 | 9:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

08-10-2025 12:00:00 AM

జిల్లా కాంగ్రెస్ నాయకులు దరిపల్లి వీరన్న 

నూతనకల్, అక్టోబర్ 7 : మండల పరిధిలోని మిర్యాల గ్రామ పంచాయతీ వద్ద నార్కట్పల్లి కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో ది. 8-10-2025 బుధవారం నాడు ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుందని జిల్లా కాంగ్రెస్ నాయకులు దరిపెల్లి వీరన్న మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శిబిరంలో కామినేని హాస్పిటల్ నుండి ఎంతో అనుభవం కలిగిన వైద్య నిపుణులు వస్తున్నారని, షుగరు, బిపి,మోకాళ్ళ నొప్పులు, వెన్నెముక సమస్యలు,కంటిచూపు సమస్యలు, దగ్గు, దమ్ము, ఆయాసం, డెంగ్యూ జ్వరం సహా అన్ని రకాల  ఆరోగ్య సమస్యలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ఉచిత వైద్య సేవలను మిర్యాల గ్రామ ప్రజలందరూ సద్విని యోగం చేసుకోవాల్సిందిగా కోరారు.