26-05-2025 09:59:08 PM
కార్మిక నాయకుల అక్రమ అరెస్టు దుర్మార్గం..
హనుమకొండ,(విజయక్రాంతి): భారత రాష్ట్ర సమితి కార్మిక విభాగం, మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్(Hanamkonda District President Dasyam Vinay Bhaskar) ఆధ్వర్యంలో కార్మిక సంక్షేమ మాసోత్సవాలను మే నెల పాటు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ కార్మిక సంఘాలు వారు గుర్తించిన కార్మిక సమస్యలను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్యకి సోమవారం రోజున నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లులో భాగంగా వారికి అందజేయాలని బయలుదేరిన కార్మిక సంఘ నాయకులను సుబేదారి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. కాగా కార్మిక సంఘాల నాయకులను సుబేదారి పోలీసులు సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
నిర్బంధం మధ్యే వినతిపత్రం అందజేత...
హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్‌లో ఉన్న జిల్లా ఉన్నతాధికారులను కార్మిక సంఘాల నాయకులు కలిశారు. కార్మికుల సమస్యలు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించేలా చొరవ చూపాలని కోరారు. కాగా కార్మిక సంఘాల నాయకుల వెంట సుబేదారి పోలీసులు సైతం కలెక్టర్ కార్యాలయానికి వచ్చి, వినతిపత్రం ఇచ్చి వెళ్లే వరకు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికుల సంఘ రాష్ట్ర గౌరవ సలహాదారుడు ఎంజాల మల్లేశం, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు నాయిని రవి, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తేలు సారంగపాణి, నగర అధ్యక్షులు సిరికొండ బిక్షపతి, ఉమ్మడి జిల్లా పెయింటర్ అధ్యక్షులు రాజారపు రాజు, మేకల రాజేందర్, భిక్షపతి, నారాయణగిరి రాజు, చేరాలు, శ్యామ్, ఎండి గౌస్ సాదిక్, చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షులు ఎండి ఇస్మాయిల్, ఎండి షబీర్, ఉమేందర్, నాయకులు, సభ్యులు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది.