2 May, 2026 | 5:16 PM

రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ

08-08-2025 11:40 PM

మంచిర్యాల (విజయక్రాంతి): జనగామ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి జావెలిన్ మీట్(State Level Javelin Meet)లో జిల్లా కేంద్రంలోని కార్మెల్ పాఠశాల విద్యార్థి ప్రతిభ కనబర్చినట్లు ప్రిన్సిపాల్ సిస్టర్ సారూప్య తెలిపారు. శుక్రవారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్టేట్ మీట్ లో జావెలిన్ 14 సంవత్సరాల బాలికల విభాగంలో తృతీయ స్థానం సాధించిన సృష్టి యోగ్యతను వైస్ ప్రిన్సిపాల్ సిస్టర్ సీమ, సిస్టర్ సోఫియాలతో కలిసి అభినందించారు.