calender_icon.png 9 August, 2025 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయంత్రం లోపు చంపేస్తాం

09-08-2025 12:00:00 AM

  1. ఎంపీ రఘునందన్‌కు మరోసారి బెదిరింపులు
  2. ఆందోళన వ్యక్తం చేస్తున్న కార్యకర్తలు

హైదరాబాద్, ఆగస్టు 8 (హైదరాబాద్): ‘హైదరాబాద్‌లోనే ఉన్నాం.. సాయంత్రం వరకు నిన్ను చంపేస్తాం’ అంటూ శుక్రవారం ఆగంతకులు మెదక్ ఎంపీ రఘునందన్‌రావును బెదిరించారు. నిన్ను ఎవరు కాపాడుతారో చూస్తాం అంటూ ఫోన్‌లో తీవ్రమైన బెదిరింపులకు దిగారు. రఘునందన్‌ను చంపుతామంటూ బెదిరించడం ఇది ఆరోసారి. ఆయన్ను ఇన్నిసార్లు బెదిరిస్తున్న వారెవరనేదానిపై పార్టీ నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆందోళనకు గురి అవుతున్నారు.

పలుమార్లు కాల్స్ వచ్చాయిలే చేసేదేమీ లేదు.. ఉత్తి బెదిరింపు కాల్స్ అని భావించే లోపు ఏదైనా చేసేందుకు కుట్ర జరుగుతుందా అని ఆయన సన్నిహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు రఘునందన్‌ను ఇంతా బెదిరింపులకు పాల్పడుతోందని ఎవరనే అంశంలోనూ పార్టీ శ్రేణులకు అంతుపట్టడం లేదు. ఈ సారి ఆయనకు 94043 xxxxx నంబర్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది.

ఇది మహారాష్ట్ర సర్కిల్‌కు చెందిన బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ నెంబర్ కావడం విశేషం. కాగా.. రఘునందన్ దేవాలయాల భూముల అన్యాక్రాంతం, దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. గతంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు సైతం ఇలాగే బెదిరింపు కాల్స్ వచ్చేవి. ఇప్పుడు రఘునందన్ రావుకు వరుస బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.