నేతల చూపు.. కారు వైపు
నిర్మల్ జిల్లాలో బీఆర్‌ఎస్ నేతలతో మంతనాలు
ఉన్న పార్టీలో టికెట్ రాకపోతే గులాబీ గూటికి చేరుతామని హెచ్చరిక
మున్సిపల్ ఎన్నికల వేళా మారుతున్న రాజకీయం
నిర్మల్, జనవరి 6 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో రాజకీయం వేడెక్కుతుంది. గ్రామపంచాయతీలో ఎన్నికల ఘట్టం ముగియగా ఇప్పు డు అందరి దృష్టి మున్సిపాలిటీలపై పడింది. ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు వేగంగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు అం తే వేగంగా మారుతున్నాయి. జిల్లాలో నిర్మల్ బైంసా ఖానాపూర్ మున్సిపాలిటీలు ఉండగా నిర్మల్ లో 42 ఖానాపూర్ లో 12 బైంసాలో 26 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు చేస్తున్నారు. ఇప్పటికే ఓటర్లు జాబి తా ప్రకటించిన అధికారులు రిజర్వేషన్ల అంశం పై ఎదురుచూస్తున్నారు అయితే నిర్మల్ జిల్లా లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బి ఆర్‌ఎస్ బిజెపి ఆయా ప్రాంతాల్లో ప్రభావం చూపట్టగా మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ కూడా రంగంలో ఉండడంతో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి.
కారువైపు రెండవ క్యాడర్ చూపు
జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలైన బిజెపి ఎంఐఎం పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉంటుందని మొదట భావించినప్పటికీ బి ఆర్‌ఎస్ పార్టీకి కూడా ఆదరణ పెరుగుతోంది నిర్మల్ జిల్లాలో ఖానాపూర్లో అధికార పార్టీ ఎమ్మెల్యే వేడుమ బుజ్జి పటేల్ నిర్మల్ ముధోళ్ బిజెపి ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి రామారావు పటేల్ ప్రాతినిత్యం వహిస్తున్నా రు. కాంగ్రెస్ పార్టీలో కూడా బలమైన నేతలు ఉన్నారు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి మాజీ ఎమ్మెల్యేలు రేఖా శాం నాయక్ విట్టల్ రెడ్డి శ్రీహరి రావు వంటి నేతలు ఉండటంతో పార్టీలో ఆశావాదులు ఎక్కువగా ఉన్నారు.
ఈ మూడు పార్టీలో వార్డు కౌన్సిలర్ల కోసం తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో వర్గ విభేదాలు రాజకీయ పలుకుబడి ఆర్థిక బలం తదితర కారణాల టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది ఈ నేపథ్యంల పార్టీలో టికెట్ కోసం ఇప్పటికి తీవ్రమంతనాలు సాగిస్తున్నారు ఒకే పార్ట్ నుంచి ఇద్దరు ముగ్గురు టికెట్ కోసం ప్రయత్నం పార్టీ మాత్రం ఒక్కరికి ఎంపిక చేసే అవకాశం ఉండడంతో మిగతా వారు పార్టీకి దూరమయ్యే అవకాశం ఉంది అందుకే ఇప్పటినుంచి గులాబీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు టికెట్ తో పోటీ చేసి గెలుపొందాలని ఆ నేతలతో టచ్ లో ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ బిజెపిలో అన్ని వార్డులో ఇద్దరి నుంచి ముగ్గురు పోటీ పడుతుండగా పార్టీ ఒక్కరికి టికెట్ ఇస్తే మిగతా ఇద్దరు నిరాశ గురవుతున్నారు.
ఇద్దరిలో బలమైన వ్యక్తిని బి ఆర్‌ఎస్ లో చేర్చుకునేందుకు పార్టీ నేతలు మంతనాలు జరుపుతున్నారు కాంగ్రెస్ బిజెపి ఎంఐఎం పార్టీలో బలమున్న నేతల్లో టికెట్ రానివారికి బి ఆర్ ఎస్ చేర్చుకొని గట్టి పోటీ ఇవ్వడం అధికార పార్టీ పార్టీ అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నారు నిర్మల్ లో బి ఆర్‌ఎస్ ర జిల్లా నాయకులు రామ్ కిషన్ రెడ్డి మార్కొండ రాము ఖానాపూర్ లో జాన్సన్ నాయక్ ముధోల్లో రమాదేవి కిరణ్ కా రే లోలం శ్యాంసుందర్ వంటి నేతలు అసంతృప్తి వ్యక్తం చేసే బిజెపి కాంగ్రెస్ ఎంఐఎం పార్టీ నేతలను పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆపరేషన్ గులాబీ జెండా కార్యక్రమాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికీ అటువంటి జాబితాను రూపొందించి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతుంది ఎన్నికల షెడ్డులు ప్రకటించిన అనంతరం వారికి కండువా వేసి పార్టీలో ఆహ్వానించి బి ఆర్‌ఎస్ బీఫామ్ ఇప్పించేందుకు సిద్ధమవుతున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించడం బి ఆర్‌ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలను దక్కించుకోవడం కోసం వారి ప్రయ త్నాలు ఏ మేరకు ప్రయోజనం చేకూర్స్తాయో చూడాలి అయితే మూడు నియోజకవర్గాల్లో 30 మంది కౌన్సిలర్ పోటీ చేసే అభ్యర్థులు బి ఆర్‌ఎస్ టికెట్ ఇప్పించాలని దరఖాస్తు పెట్టుకున్నట్టు తెలుస్తుంది ఈ విషయం బయటకు పోకుండా ఆ పార్టీ నేతలు జరిగిన పరిణామాలు నిశితంగా పరిశీలిస్తున్నారు.




