calender_icon.png 8 January, 2026 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్తీ బాటలో విద్యుత్ మరమ్మతులు

07-01-2026 12:21:28 AM

మేడ్చల్ అర్బన్, జనవరి 6 (విజయక్రాంతి):గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ సర్కిల్ ప్రాంతంలో గల గుండ్లపోచంపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పట్టణంలో బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా విద్యుత్ అధికారులు విద్యుత్ మరమ్మత్తులను చేపట్టడం జరిగిందని విద్యుత్ రూరల్ ఎఈ కె విజయ్ కుమార్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తి బాట కార్యక్రమంలో భాగంగా లక్ష్మీ నగర్,మహంకాళి కాలనీ ప్రాంతాలలో విద్యుత్ పోల్స్ షిఫ్టింగ్‌తో పాటు కొత్త పోల్స్, కేబుల్, వైర్ తదితర మరమత్తులను చేపట్టినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ బిజెపి మాజీ కౌన్సిలర్ దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్ తో పాటు విద్యుత్ అధికారులు ఏ కృష్ణ.లూథర్ సిబ్బంది పాల్గొన్నారు.