calender_icon.png 21 September, 2025 | 5:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి చొరవతో రోడ్డుకు మరమ్మతులు

21-09-2025 04:30:15 PM

వలిగొండ (విజయక్రాంతి): గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో దెబ్బతిన్న వలిగొండ-భువనగిరి రోడ్డుకు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి(MLA Anil Kumar Reddy) చొరవతో మరమ్మత్తులు చేపట్టారు. వర్షాలతో భారీ గుంతలు ఏర్పడి వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని, దసరా సెలవులు కావడంతో పాటు బతుకమ్మ పండుగ, దసరా పండగ పురస్కరించుకొని ప్రయాణికులు వాహనదారులు గ్రామాల్లోకి రాకపోకలు సాగిస్తుంటారని ఈ రహదారి గుండా పెద్ద ఎత్తున వెళ్తుంటారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా ఆయన ఆర్ అండ్ బి అధికారులతో మాట్లాడి రోడ్డు మరమ్మతుల పనులు చేయించారు. ఈ సందర్భంగా రహదారిపై వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.