calender_icon.png 21 September, 2025 | 6:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీతయ్యను పరామర్శించిన మాజీ మార్కెట్ చైర్మన్ పులుసు యాదగిరి గౌడ్

21-09-2025 04:35:42 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని బండ రామారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్యకు ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలుకు బలమైన గాయం జరిగింది. దీనితో డిశ్చార్జ్ అయి బండ రామారం గ్రామానికి రాగా, జరిగిన సంఘటన తెలుసుకున్న తుంగతుర్తి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పులుసు యాదగిరి గౌడ్ పరామర్శించి, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి తునికి సాయిలు, బిజెపి జిల్లా నాయకులు పులుసు వెంకటనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.