తపస్ నూతన కార్యవర్గం ఎన్నిక
అధ్యక్షుడిగా రాజశేఖర్, కార్యదర్శిగా పెంటయ్య
హైదరాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) నూతన కార్యవర్గం ఎన్నికైంది. తపస్ రాష్ట్ర కార్యనిర్వాహక సమావేశం ఆదివారం అబిడ్స్‌లోని స్టాన్లీ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా వొడ్నాల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శిగా తెల్కలపల్లి పెంటయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ర్ట సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు.
రాష్ర్టంలో నూతన జాతీయ విద్యా విధానం అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న పీఆర్సి, డీఏలను ప్రకటించాలని, విద్యారంగం ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏబీఆర్‌ఎస్‌యం జాతీయ సంఘటన మంత్రి మహేంద్ర కపూర్, పూర్వ తపస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హనుమంత్ రావు, నవాత్ సురేష్ పాల్గొన్నారు.




