12-01-2026 02:33:59 AM
ముషీరాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): యువకుల్లో దేశభక్తి, దైవభక్తిని పెంపొందించాలని తెలంగాణ మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్, తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ అన్నారు. ఈ మేరకు ఆదివారం రాజేంద్రనగర్ హరిహర క్షేత్రంలో మన్నె శ్రీ భజన కీర్తనలు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడుతూ మన్నె శ్రీ మహాత్మ రావు గాయకుడిగా ఇప్పటివరకు 13 ఆధ్యాత్మిక పుస్తకాలను రచించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారని అన్నారు. ఆయన చిన్ననాటి నుంచి రాసిన 2000లకు పైన భజన ఆధ్యాత్మిక తత్వ గీతాల్లో నుంచి ప్రజాధరణ పొందిన 108 పాటలు మన్యశ్రీ భజన కీర్తనలు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సింగరావు, వై.శ్రీధర్, బాల రాజు ముదిరాజ్, శేఖర్ ముదిరాజ్, సతీష్ కుమార్, ఎన్. కృష్ణ, డాక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.