calender_icon.png 12 January, 2026 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

6.90 లక్షల చైనా మాంజా పట్టివేత

12-01-2026 02:05:01 AM

  1. హర్యానా నుంచి గుట్టుచప్పుడు కాకుండా రవాణా
  2. ఒక్కో బాబిన్ ధర రూ.2 వేలు.. వ్యాపారి అరెస్ట్

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 11 (విజయక్రాంతి): చైనా మాంజాను విక్రయి స్తున్న ఓ వ్యాపారిని వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం నిర్వహించిన ఈ మెరుపు దాడిలో దాదాపు రూ. 6.90 లక్షల విలువైన 345 చైనా మాంజా బాబిన్లను స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీలోని కాలాపత్తర్, డెక్కన్ బేకరీ సమీ పంలో ఉన్న సాధు కైట్ షాప్ నిర్వాహకుడు మహ్మద్ షాజైబ్ (42) చైనా మాంజాను నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎండి ఇక్బాల్ సిద్ధిఖీ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ సిహెచ్ యా దేందర్, ఎస్సై జి సందీప్‌రెడ్డి బృందం ఆకస్మిక దాడి చేసింది.

షాపులో సోదాలు నిర్వ హించగా, నిషేధిత సింథటిక్ నైలాన్ కోటెడ్ మాంజా బయటపడింది. నిందితుడు షాజైబ్ వాట్టపల్లి నివాసి. పతంగుల వ్యా పారం చేసే ఇతను, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో అడ్డదారి తొక్కాడు. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన విక్రమ్ మెహతా అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అక్కడి నుంచి ట్రాన్స్‌పోర్టు ద్వారా గుట్టుచప్పుడు కాకుం డా నగరానికి తెప్పించాడు. ఒక్కో బాబిన్‌ను సుమారు రూ.2వేల చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. నిందితుడిని, స్వాధీనం చేసుకున్న సరుకును తదుపరి విచారణ నిమిత్తం కాలాపత్తర్ పోలీసులకు అప్పగించారు.