03-05-2025 01:38:37 AM
హనుమకొండ, మే 2 (విజయ క్రాంతి): వరంగల్ మహా నగరంలో నీ హనుమకొండ, కాజీపేట లలో ఫుడ్ సేఫ్టీ విషయంలో నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు పాటించకుండా ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడుతున్న వ్యాపారస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలనే గట్టి నిర్ణయంతో వరంగల్ పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు, టాస్క్ఫోర్స్ ఎ.సి.పి మధుసూదన్ ఆద్వర్యం లో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ జి. బాబూలాల్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వేణు ల సిబ్బందితో నమ్తబాద్ అమర్నాథ్ నడుపుతున్న పర్వతలాల్ ఐస్ క్రీమ్ తయారీ, డిస్ట్రిబ్యూషన్ షాపు లో దాడి చేసి అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఫుడ్ సేఫ్టీ నియమాలు పాటించకుండా, తయారీ, ఎక్స్పైరీ తేదీలు ముద్రించకుండ అమ్మకానికి పాడైపోయిన ఐస్ క్రీములు దాదాపు 7 రకాల సుమారు 29,050 రూపాయల విలువ గల ఐస్ క్రీమ్ ఉత్పత్తులు స్వాధీనం చేసుకుని షాప్ ఓనర్ నమ్తాబాద్ అమర్ నాథ్ తండ్రి పర్వత్ లాల్, 46 సంవత్సరాలు, కటిక, ఇంటి నెంబర్:25-4-247 విష్ణుపురి కాలని, ఖాజీపేట , హన్మకొండ లోని ప్రాపర్టీ తో పాటు తదుపరి చర్య నిమిత్తం ఫుడ్ సేఫ్టీ అధికారికి అప్పగించడం జరిగింది.
పోలీసులు ఐస్ క్రీమ్ వ్యాపారస్తులకు హెచ్చరిక..
ఆహార భద్రత విషయంలో అపరిశుభ్రంగా, కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయించినా, నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై చర్యలు తప్పవు, ప్రముఖ బ్రాండ్లను మార్పు చేసి విక్రయాలు చేస్తున్న నకిలీ వస్తువులపై నిఘా ఉంచాం.
గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయిస్తే ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్ యాక్ట్ 2006, 2011 రూల్స్, రెగ్యులేషన్స్ ప్రకారం నిబంధనలు పాటించని ఫుడ్ సేఫ్టీ శాఖ సహాయంతో వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం. ఇట్టి దాడిలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ జి.బాబులాల్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వేణు పాల్గొన్నారు.