03-05-2025 01:38:07 AM
సూర్యాపేట, మే 2: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) అనేది భారతదేశంలో వైద్య, దంత కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించబడే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష కు సంబంధించి సూర్యాపేట జిల్లాలో మొత్తం 4 పరీక్ష కేంద్రాలు తెలంగాణ మోడల్ స్కూల్ ఇమాంపేట, టి జి ఎస్ డబ్ల్యూ ఆర్ స్కూల్ మరియు కళాశాల (బాలికలు ) ఇమాంపేట, తెలంగాణ మైనార్టిస్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల దురాజ్ పల్లి, గవర్నమెంట్ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
890 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని, విద్యార్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డు తో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకొని రావాలన్నారు. పరీక్ష కేంద్రానికి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్లు, పర్సులు, బంగారు ఆభరణాలు తదితర ఎలాంటి వస్తువులు అనుమతిలేదని, ఆయా కేంద్రాల్లో కంట్రోల్ రూం, సీసీ కెమెరాలు,అవసరమైన బందోబస్తు, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ నిర్వహించి పరీక్షలను పకడ్బoదిగా నిర్వహించాలన్నారు. ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 01:30 వరకు కేంద్రానికి అనుమతిస్తారని పేర్కొన్నారు.