03-05-2025 01:39:32 AM
హుజూర్ నగర్, మే 2: గుర్తు తెలియని మగ వ్యక్తి మృతి చెందిన సంఘటన హుజూర్నగర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హుజూర్ నగర్ లోని గోల్డెన్ సిటీ వెంచర్ వెనకవైపు గల ఆత్కూరి రమేష్ అనే వ్యక్తి పొలంలో సుమారు ( 30 -35 ) సంవత్సరాల మగవ్యక్తి మృతి చెంది ఉన్నాడని, ఈ విషయాన్ని పశువుల కాపరులు గమనించి పోలీస్ వారికి సమాచారం అందించారని తెలిపారు.
ఈ వ్యక్తి గత రెండు మూడు రోజుల నుండి ఇక్కడ తిరుగుతున్నట్లుగా తెలుస్తుంది. చనిపోయిన వ్యక్తి నలుపు రంగులో,అందాజా 5 ఫీట్ల పొడవు , మెడలో నలుపు రంగు దారంతో తాయత్తు, నడుముకు ఎరుపు రంగు దారంతో మొలతాడు, కుడి చేతికి ఎరుపు రంగు, పసుపు పచ్చ రంగు దారాలు కలిగి ఉండి బ్లూ కలర్ బ్యాండ్ , కుడి చేతి మధ్య వేలికి రింగు ధరించి ఉన్నాడని,కావున ఎవరైనా ఈ వ్యక్తిని గుర్తించినట్లయితే వెంటనే 8712686051 యస్ ఐ హుజుర్నగర్,8712686012 సీఐ హుజుర్నగర్ పోలీసు వారిని సంప్రదించగలరని తెలిపారు.