calender_icon.png 12 November, 2025 | 2:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కట్టు బట్టలతో సహ కాలి బూడిదైన కుటుంబానికి డిసిసిబి చైర్మన్ అండ

12-11-2025 01:04:09 PM

ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు

మునుగోడు,(విజయక్రాంతి): మునుగోడు మండల పరిధిలోని జమస్థాన్ పల్లి గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధమై కట్టు బట్టలతో సహకాలి బూడిదై సర్వం కోల్పోయి రోడ్డునుపడ్డ చెక్క లింగరాజు, లక్ష్మి దంపతుల కుటుంబానికి ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి అండగా నిలిచి  10వేలు రూపాయల ఆర్థిక సహాయాన్ని పంపించి మానవత్వం చాటుకున్నారు.

బుధవారం నగదును గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు బాధిత కుటుంబానికి అందజేశారు. ఇంట్లో సామాగ్రి అగ్నికి ఆవుతయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డ బాధిత కుటుంబానికి డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డికి ఆర్థిక సాయం అందజేయడం పట్ల గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఆర్థిక సాయం చేసి ఆదుకుంటున్న శ్రీనివాస్ రెడ్డికి గ్రామస్తులు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారన్నారు.