calender_icon.png 23 May, 2025 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్టోబర్‌లో వృషభ

22-05-2025 12:34:01 AM

మాలీవుడ్‌లో మోహన్‌లాల్ నుంచి వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్టు ‘వృషభ’. మోహన్‌లాల్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి మేకర్స్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.  ఈ సినిమాలో ఆయన ఉత్తమ యోధుడిలా కనిపించబోతున్నారని తెలుస్తోంది. నంద కిషోర్ రచనాదర్శకత్వంలో రాబోతోంది. యాక్షన్, ఎమోషన్, పౌరాణిక గాథలు సమ్మిళిత మైన ఓ దృశ్య కావ్యంలా రూపుదిద్దుకుంటోంది.

మలయాళం, తెలుగులో ఏకకాలంలో చిత్రీకరిస్తున్న ఈ మూవీని ఇదే ఏడాది అక్టోబర్ 16న తెలుగు, మలయాళం, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సీకే పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, విశాల్ గుర్నానీ, జూహీ పరేఖ్ మెహతా ఇందులో భాగమయ్యారు.   

‘కన్నప్ప’లో కిరాతగా.. 

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. మే 21న మోహన్‌లాల్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి మేకర్స్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇందులో మోహన్ లాల్ కిరాత పాత్రలో కనిపించారు. జూన్ 27న విడుదల కానుంది.