calender_icon.png 22 May, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

థియేటర్లు బంద్.. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతల భేటీ

21-05-2025 08:10:04 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో బుధవారం సాయంత్రం ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల నిర్వహించిన నిర్మాతల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లపై మరోసారి చర్చించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈనెల 23వ తేదీన ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతల సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. గతకొన్ని రోజుల క్రితం తెలుగు రాష్ట్రాలోని సినీ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేకపోవడంతో జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణియించారు.

ఈ నేపథ్యంలో సినీ నిర్మాతలు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో భేటీ అయి థియేటర్ల బంద్ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. పర్సెంటేజ్ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. ఈ అంశంపై రేపు మరోసారి భేటీ అవుతామని తెలిపారు. ఈ సమస్యకు రేపటి సమావేశంలో పరిష్కారం లభించే అవకాశం ఉందని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమావేశంలో నిర్మాతలు దిల్ రాజు, సురేశ్ బాబు, డీవీవీ దానయ్య, సాహు గారపాటి, బాపినీడు, నాగవంశీ తదితరులు పాల్గొన్నారు.