22-05-2025 12:36:16 AM
రానా, వెంకటేశ్, అర్జున్ రాంపాల్, సుర్విన్ చావ్లా, కృతి కర్బందా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డినో మారియో ప్రధాన తారాగణంగా రూపుదిద్దుకున్న వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు 2’. ఈ సిరీస్‌కు క్రియేటర్ కరణ్ అన్షుమన్ కాగా కరణ్ అన్షుమన్, సుపర్ణ్ వర్మ, అభయ్ చోప్రా దర్శకత్వం వహించారు. సుందర్ అరోన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జూన్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ సీజన్2కు సంబంధించి ఫస్ట్‌లుక్ విడుదలైంది.
హైదరా బాద్‌లో బుధవారం జరిగిన ఈ పోస్టర్ ఆవిష్కరణ వేడుకలకు నటులు రానా, అర్జున్ రాంపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ సీజన్ వన్ కంటే సీజన్2 మరింత వైల్డ్‌గా ఉంటుంది. నేను రానా నాయుడుగా నటిస్తే, రవుఫ్ పాత్రలో అర్జున్ రాంపాల్ నటించారు. ఇద్దరి పాత్రలూ ఢీ అంటే ఢీ అనేలా ఉంటాయి’ అని తెలిపారు. ‘షూటింగ్‌లో నేను రానాతో చక్కగా కలిసిపోయా. వెంకటేశ్ కూడా సరదా వ్యక్తే’ అని అర్జున్ రాంపాల్ చెప్పారు.