14-05-2025 10:05:43 PM
ములకలపల్లి (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల కేంద్రంలో బుధవారం తెలుగుదేశం పార్టీ గ్రామ, మండల కమిటీ ఎన్నిక జరిగింది. ఈ ప్రక్రియను ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ వాసిరెడ్డి రామనాథం(Sri Vasireddy Ramanatham), అశ్వారావుపేట పేట నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ శ్రీ చెరుకూరి చలపతి రావు ఆధ్వర్యంలో ములకలపల్లి మండల పార్టీ అధ్యక్షులు తేళ్ల చెన్నయ్య ఇంటి వద్ద నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ కట్రం స్వామి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష కార్యదర్శులు తేళ్ళ చెన్నయ్య, చల్లా వెంకటేశ్వర్లు నాయకులు, గంగి శెట్టి సత్యనారాయణ, Md జబ్బార్, కేసరి లక్ష్మణరావు, బిక్కు మల్ల సుధాకర్ రావు, కనకం వెంకటేశ్వర్లు, కే దుర్గాప్రసాద్, కేసరి శ్రీను రాములు భక్కులు మిరియాల శంకర్రావు ఓట్ల కొండలరావు వెంకన్న, విలేకరి గడ్డం ఉదయ్ కుమార్, గాదె శ్రీను అశ్వరావుపేట మండల అధ్యక్షులు నార్లపాటి శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.