14-05-2025 10:09:15 PM
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్..
ఖానాపూర్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ కోసం కష్టించే వారికి భవిష్యత్తు ఉంటుందని ఏ ఒక్క కార్యకర్తను కూడా విస్మరించమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bhojju Patel) అన్నారు. బుధవారం ఖానాపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గ అన్ని మండలాల నుంచి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పరిశీలకులు చంద్రశేఖర్ గౌడ్, ఎండి అవిజ్, తహిర్బన్ హందన్, ఖానాపూర్ మండల అధ్యక్షులు ధోనికేని దయానంద్, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, పలువురు బ్లాక్ గ్రామ శాఖ అధ్యక్షులు, అనుబంధ సంఘాల, మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, సర్పంచులు, మాజీ జెడ్పిటిసిలు, ఎంపీటీసీలు, పలువు నాయకులు హాజరయ్యారు.