14-05-2025 09:39:06 PM
సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ డిమాండ్...
పెన్ పహాడ్: ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉపాధి హామీ పనుల వద్ద సౌకర్యాలు కల్పించడమే కాకుండా కొలతలు లేకుండా ప్రతి కూలికి రూ. 600 చెల్లించి కూలీలను ఆదుకోవాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ(CITU District Committee Member Ranapanga Krishna) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. బుధవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం లింగాల గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనుల వద్ద ఉపాధి హామీ కూలీల సమస్యలు తెలుసుకుని ఆయన మాట్లాడారు.
తీవ్రమైన ఎండలు ఉన్నప్పటికీ తగిన వసతులు కల్పించకపోవడంతో ఉపాధి కూలీలు వడడెబ్బకు గురవుతున్నారని అన్నారు. కేరళ ప్రభుత్వం మాదిరిగానే ఉపాధి హామీ కూలీలకు కొలతలు లేకుండా రోజుకు 600 రూపాయలు చెల్లిస్తుందని, ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తుందని అదే మాదిరిగానే తెలంగాణలో అమలు చేయాలని రేవంతరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు రణపంగ కోటయ్య, సుకన్య, రణపంగ శ్రీకాంత్, సైదులు, సుజాత, వెంకన్న, దీప, సైదమ్మ, రజిని, శాంత, చిట్టి, గురవమ్మ, శారమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు.