13-12-2025 01:19:04 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 12 (విజయక్రాంతి): విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయురాలు పసివాడిపై ప్రతాపం చూపిం ది. చదువు రావడం లేదన్న కారణంతో విచక్షణ కోల్పోయి ఏడేళ్ల బాలుడిని అట్లకాడతో వాతలు పెట్టి నరకం చూపించింది. హైదరాబాద్ నడిబొడ్డున ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలు గుచూసిన ఈ అమానవీయ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
నగరంలోని షేక్‌పేట, ఓయూ కాలనీకి చెందిన వల్లు తేజ సందన్ (7) అనే బాలుడు స్థానిక పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు ఆ బాలుడిని అదే ప్రాం తంలో నివా సం ఉండే శ్రీ మానస అనే మహిళ వద్ద ట్యూషన్‌కు పంపిస్తున్నారు. శుక్రవారం ట్యూషన్ సమ యంలో బాలుడు సరిగా చదవడం లేదని, చెప్పిం ది అప్పజెప్పలేదని శ్రీ మానస ఆగ్రహంతో ఊగిపోయింది. కోపాన్ని అదుపు చేసుకోలేకపోయిన ఆమె వంటగదిలోని అట్లకాడను స్టవ్ మీద కాల్చి, వేడి కడ్డీతో బాలుడిపై దాడి చేసింది.
బాలుడు ఏడుస్తున్నా కనికరించకుండా ముఖం, చేతులు, కాళ్లు.. ఇలా శరీరమంతా ఎక్కడ పడితే అక్కడ వా తలు పెట్టింది. దీంతో బాలుడి శరీరంపై ఏకం గా 8 చోట్ల కాలిన గాయాలు అయ్యాయి. ఇంటికి వ చ్చిన బాలుడు నొప్పితో విలవిల్లాడుతుండటం, ముఖంపై వాతలు ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. చొక్కా విప్పి చూ డగా చేతులు, కాళ్లపై కూడా వాతలు కనిపించడంతో ఆరా తీయగా.. టీచర్ అట్లకాడతో కా ల్చిం దని బాలుడు భయపడుతూ చెప్పాడు.
దీంతో తల్లిదండ్రులు ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యా దు చేయగా శ్రీ మానసపై కేసు నమోదు చేశారు. బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం గోల్కొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. శ్రీ మానసపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలుడి తల్లిదండ్రులు, కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.