calender_icon.png 13 December, 2025 | 8:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో పరిస్థితులు మారుతాయి

13-12-2025 01:14:26 AM

  1. ప్రజల వెంట ఉంటే బీఆర్‌ఎస్‌కు మళ్లీ అవకాశం
  2. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్
  3. ‘ఎస్పీ’ స్ఫూర్తితోనే బీఆర్‌ఎస్ బౌన్స్‌బ్యాక్: కేటీఆర్

హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): తెలంగాణలో రాజకీయ పరిస్థితులు త్వరలో మారుతాయని, నిరంతరం ప్రజల వెంట ఉంటే బీఆర్‌ఎస్‌కు తిరిగి అవకాశం ఇస్తారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రజలపక్షాన నిలబడి పోరాడితే, తప్పకుండా అండగా ఉంటారని వ్యాఖ్యానించా రు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా శుక్రవారం నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన అఖిలేష్.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశమయ్యారు.

అనంతరం కేటీఆర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో జయాపజయాలు సహజమని, ఒక్కోసారి ప్రజలు మన పనితీరును, విధానాలను పునఃసమీక్షించుకునే అవకాశాన్ని ఓటమి ద్వారా కల్పిస్తారని అఖిలేష్ యాదవ్ అభిప్రాయప డ్డారు. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ ప్రస్థానాన్ని ఉదహరిస్తూ.. గతంలో తాము కూడా చాలా తక్కువ సీట్లు గెలిచామని, కానీ ప్రజలు తమ వెంటే నిలిచారని గుర్తుచేశారు. వారి మద్దతుతోనే నేడు యూపీలో బీజేపీని రెండో స్థానానికి నెట్టి, 37 మంది ఎంపీలతో లోక్‌సభలో బలంగా ఉన్నామని చెప్పారు.

ప్రజ లు ఎప్పుడు ఎవరికి అండగా నిలబడతారో ఎవరూ ఊహించలేరన్నారు. ప్రజల వెంట ఉంటే వారే తమకు అవకాశాన్ని ఇస్తారన్నారు. కచ్చితంగా తెలంగాణలోనూ ప్రజల ఆలోచనలో మార్పు వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. దేశంలో ప్రస్తుతం విభజన రాజకీయాలు నడుస్తున్నాయని, వాటికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని అఖిలేష్ పిలుపునిచ్చారు.

రాజకీయాల్లో ప్రతికూలత పోవాలని, అభివృద్ధి, సానుకూల దృక్పథం తో కూడిన ప్రగతిశీల రాజకీయాలు రావాలని ఆకాంక్షించారు. తాము అదే విజన్‌తో ముం దుకు వెళ్తున్నామని స్పష్టంచేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో కూడా మాట్లాడానని, తర్వలోనే వచ్చి ఆయనను కలు స్తానని తెలిపారు. 

అఖిలేష్ మాకు స్ఫూర్తి: కేటీఆర్

శాసనసభ ఎన్నికల్లో అధికారం కోల్పోయినప్పటికీ, పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి దేశంలోనే మూడో అతిపెద్ద పార్టీగా ఎస్పీని నిలబెట్టిన అఖిలేష్ తీరు తమకు స్ఫూర్తిదాయకమని కేటీఆర్ పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో బీఆర్‌ఎస్ కూడా బౌన్స్ బ్యాక్ అవుతుందని, మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ప్రజల వెంట నిలబడి మరోసారి తప్పకుండా ప్రజ ల ఆశీర్వాదాలు పొందుతామని చెప్పారు.

తమ పార్టీ నేతలు అఖిలేష్‌కు సాధారణంగా స్వాగతం కలిపి ఆయనతో వివిధ అంశాలపై చర్చించినట్టు కేటీఆర్ తెలిపారు. అఖిలేష్ యాదవ్ మరోసారి హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్‌తో సమావేశం అవుతారని పేర్కొన్నారు. ఈ పర్యటనలో భాగంగా తనతోపాటు తన పార్టీ సీనియర్ నేతలు అం దరితో చర్చించి మా పార్టీ ఆతిథ్యం స్వీకరించినందుకు అఖిలేష్ యాదవ్‌కు ధన్యవాదా లు తెలుపుతున్నట్టు కేటీఆర్ వెల్లడించారు.