calender_icon.png 11 September, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉన్నతులుగా తీర్చిదిద్దేవారే గురువులు

09-09-2025 12:55:43 AM

-రాజపేట చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఆర్. ఆంజనేయులు

-ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలో ఘనంగా టీచర్స్ డే 

ముషీరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాం తి): విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేవారే  గురువులని రాజపేట చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఆర్.ఆంజనేయులు పేర్కొన్నారు. సోమవారం ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో టీచర్స్ డే ను పురస్కరించుకొని రాజపేట చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మా నం, బహుతుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆర్.  ఆంజనేయులు మాట్లాడుతూ... చిన్ననాటి నుంచే పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ ఉన్నత స్థాయిలో ఉండేలా ఉపాధ్యాయ లు ఎంతో కృషిచేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, విద్యామండలి డిప్యూటీ ఐవోఓస్ స్వరూప రాణి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, పద్మావతి, రఘునందన్, కొండల్ రెడ్డి, సహనా కౌసర్, ఉషా, అబ్దుల్లా, సునిత తదితరులు పాల్గొన్నారు.