calender_icon.png 11 September, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు

09-09-2025 12:56:10 AM

ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించిన కలెక్టర్

మంచిర్యాల, సెప్టెంబర్ 8 (విజయక్రాం తి): ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు ఉంటుందని, మంచి విద్యను అందించి భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఉపాధ్యాయుడు మార్గదర్శిగా పని చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా సోమ వారం సాయంత్రం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య, జిల్లా విద్యాధి కారి ఎస్. యాదయ్యలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడంలో ఉపాధ్యాయుడి పాత్ర కీలకమన్నారు. ఉన్నత విద్య కలిగి ఉంటే అన్నింటిని సంపాదించుకోవచ్చని, ప్రశాంతంగా జీవించవచ్చన్నారు. ప్రస్తుత విద్యా విధానంలో మరిన్ని మార్పులు తీసుకువచ్చి అధునాతన సాంకేతికత వైపుగా విద్యార్థులను ముందుకు తీసుకువెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో ఈ విద్యా సంవత్సరం దాదాపు 6 వేల మంది విద్యార్థులు అదనంగా చేరారని, బడిబాట కార్యక్రమం నిర్వహించడం ద్వారా బడి మానివేసిన పిల్లలు, బడి బయటి పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలకు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. 

అనంతరం రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని సన్మానించి, జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన 71 మంది ఉపాధ్యాయులను శాలువాలు, ప్రశంసా పత్రాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.