29-07-2025 11:28:55 PM
విద్యార్థుకు ఐడి కార్డ్స్, టై, బెల్టులు అందజేత..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) కన్నెపల్లి మండలంలో ఓ ఉపాధ్యాయుడు సొంత ఖర్చుతో విద్యార్థులకు ఐడి కార్డ్స్, టై బెల్టులు అందజేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. వివరాలు ఎలా ఉన్నాయి. కన్నెపల్లి మండలం జజ్జరవెల్లి ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంకతి తిరుపతి తన సొంత ఖర్చుతో 49 మంది విద్యార్థులకు 6000 విలువగల ఐడికార్డ్స్, టై, బెల్టు ఉచితంగా పంపిణీ చేశారు.
సహా ఉపాధ్యాయురాలు అయిన రాథోడ్ సంగీత, ఐదువేల విలువగల బ్యాగులను స్వంత ఖర్చుతో ఉచితంగా పంపిణీ చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు ఐడి కార్డ్ లు, కాపీ రైటింగ్ బుక్స్, పెన్నులు, పెన్సిల్ లు పిల్లలకు ఉచితంగా ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మండల విద్యాధికారి సెడ్మిక రాము మాట్లాడుతూ గ్రామంలోని మొత్తం విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నందుకు హాజరు శాతం పెంచుతున్నందుకు ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సునీత బానేష్, తల్లిదండ్రులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.