calender_icon.png 31 July, 2025 | 9:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు దొడ్డ పద్మమ్మ కన్నుమూత

30-07-2025 12:00:00 AM

చిలుకూరు, జూలై 29 : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు హుజూర్నగర్ మాజీ శాసనసభ్యులు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ దొడ్డ నరసయ్య సతీమణి దొడ్డ పద్మమ్మ  అనారోగ్యంతో  మంగళవారం మృతి చెందినట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు తెలిపారు.

ఆమె అంత్యక్రియలు నేడు ఆమె స్వగ్రామమైన చిలుకూరు గ్రామంలో ఉదయం 11, గంటలకు జరుగుతాయన్నారు. కాగా ఆమె అంత్యక్రియలకు తెలంగాణ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పార్టీ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు హాజరవుతున్నట్లు తెలిపారు.