30-07-2025 12:00:00 AM
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
చిలుకూరు, జూలై 29 : విద్యార్థులు చిన్నతనం నుండే లక్ష్యం సాధించేవరకు శ్రమించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవా ర్, అన్నారు. మంగళవారం చిలుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోకి వెళ్లినప్పుడు ప్రజలు హైస్కూల్ మీద మంచి నమ్మకం చూపించారని, విద్యార్థులు చిన్నతనం నుండే లక్ష్యం ఏర్పరచుకొని దానిని సాధించే వరకు శ్రమించాలని సూచించారు.
అదేవిధంగా ఎన్.ఎం.ఎం.ఎస్ లో, జిల్లా ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంక్ సాధించిన,బి రవి, పి చైత్ర ను అభినందించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ.కరుణాకర్ రెడ్డి మన ఊరు మనబడి కార్యక్రమం కింద మొదలుపెట్టిన నాలుగు తరగతి గదులు ఆగిపోవడంతో వాటికి నిధులు కేటాయించి పూర్తి చేయించాలని కలెక్టర్ ని కోరగా హామీ ఇచ్చారు. తదుపరి అంగన్వాడీ కేంద్రం 4ను తనిఖీ చేసి పలు విషయాలపై ఆరా తీశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయన వెంట ఎమ్మార్వో ధృవకుమార్, ఎంపీడీవో గిరిబాబు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఏపీవో నిర్మల, ఆర్ ఐ లు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్ పాల్గొన్నారు.