calender_icon.png 26 July, 2025 | 1:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుణాత్మకమైన విద్యను ఉపాధ్యాయులు బోధించాలి

25-07-2025 09:03:43 PM

ఎంఈఓ చత్రునాయక్

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను ఉపాధ్యాయులు బోధించాలని మండల విద్యాధికారి చత్రు నాయక్ కోరారు.శుక్రవారం ఆయన మండలంలోని కొత్తగూడెం, రంగాపురం ప్రాథమిక పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆగస్టు15 వరకు అందరూ విద్యార్థులకు చదవడం రాయడం గణితంలో చతుర్విధ ప్రక్రియలు అందరికీ వచ్చే విధంగా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును ఆయన పరిశీలించారు.

విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను ఉపాధ్యాయులు అందించాలని ఆయన సూచించారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఆయన ఆదేశించారు. మొదట పాఠశాలల్లో ఉపాధ్యాయుల విద్యార్థుల హాజరు పట్టికలను ఆయన పరిశీలించారు. విద్యార్థుల హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీనిలో భాగంగా పాఠశాలలో బేస్ లైన్ టెస్ట్ పరిశీలించారు. కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆర్ లక్ష్మయ్య, జి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.