25-07-2025 10:23:38 PM
వైద్యానికి సీఎం ఆదేశాలు
సీఎంకు చిన్నారుల తల్లిదండ్రులు వేడుకోలు
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఇద్దరు చిన్నారుల ప్రాణాంతక వ్యాధితో ఎంతోకాలంగా బాధపడుతున్నారు. వారి తల్లిదండ్రులు పిల్లల చికిత్స కోసం పడారానిపాట్లు, మొక్కనీ కాళ్లు లేవు. వారి బాధ వర్ణాతితం. చికిత్స కోసం అయ్యే ఖర్చు అంతా ఇంతా కాదు. పూట గడవడమే కష్టమై నా ఆ కుటుంబానికి పిల్లలకు వైద్యం చేపించే స్తోమతలేదు. రూ.లక్షలతో అత్యంత ఖరీదైన వైద్యం అవసరమైంది. చేసేదిలేక ఇంతకాలం దేవుడిపై భారం పెట్టి కాలంవెల్లదీస్తున్నారు.
పిల్లల ఆనారోగ్యంతో నిత్యం కన్నీటి పర్యంతంమే వారి జీవితమైంది. చివరికి కొండంత ధైర్యం వారికి సాంత్వన ఇచ్చింది. చికిత్సకు సీఎం రేవంత్ రెడ్డి అభయమిచ్చారు. పట్టణంలోని టేకులబస్తికీ చెందిన దేవిని కృష్ణవేణి, కళ్యాణ్ దాస్ దంపతుల ఇద్దరు పిల్లలు అరుదైన స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ (SMA) అనే వెన్నెముక కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్నారు. తమ బాధను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు విన్నవించుకున్నారు. ఎమ్మెల్యే మానవత్వం చిన్నారుల పాలిట వరమైంది. ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి చిన్నారులతో సహా తల్లిదండ్రులు నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మొరపెట్టుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి వైద్య సహాయo అభ్యర్థనతో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామితో సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని అధికార నివాసంలో కలిశారు. తమ పిల్లల అనారోగ్య సమస్యను ఆ దంపతులు కన్నీళ్ళతోవిన్నవించారు. హృదయ విదారకరమైన వారి బాధను ఆలకించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకున్నారు. అప్పటికప్పుడే సంబంధిత వైద్య శాఖ అధికారులను తక్షణం చర్యలకు ఆదేశించారు. చిన్నారులకు అవసరమైన వైద్య సహాయాన్ని ప్రభుత్వం తరఫున అందించడానికి భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సహాయాన్ని మర్చిపోలేనమనీ, తమ పిల్లలకు పునర్జన్మ ప్రసాదించినందుకు సీఎంకు జన్మత రుణపడి ఉంటామని ఆ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.