14 July, 2026 | 5:23 AM

టీచర్లకు పర్యవేక్షణ బాధ్యతలు ఆక్షేపణీయం

23-06-2025 01:16 AM

ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల పనితీరు పర్యవేక్షణకు ఎస్జీటీ, హెచ్‌ఎంలు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను నియమించడం ఆక్షేపణీయమని ఎస్టీ యూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్‌రెడ్డి, సదానందం గౌడ్ ఆదివారాం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రభుత్వ నిర్ణయం విద్యారంగంలో సంక్షోభానికి దారితీస్తుందన్నారు. రాష్ట్రవ్యా ప్తంగా 629 మండలాల పరిధిలో మొత్తం 24,146 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయని, వాటిని తనిఖీ చేసేంత సమయం టీచర్లకు ఉండదని అభిప్రాయపడ్డారు.

పాఠాలు చెప్పేవారితో పర్యవేక్షణ చేయించడం శాస్త్రీయత కాదని పేర్కొన్నారు. విద్యా ప్రమాణాలు మరింత కుంటుపడతాయని తెలిపారు. ప్రభుత్వం అనాలోచితమైన నిర్ణయం తీసుకున్నదని, ఇప్పటికైనా ఆలోచనపై పున రాలోచించాలని విజ్ఞప్తి చేశారు.