8 July, 2026 | 8:06 PM

Breaking News

ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •  

17వ బెటాలియన్ కానిస్టేబుల్ మంచకట్ల అభిలాష్ అంతిమయాత్రలో కన్నీరుమున్నీరైన సహచరులు

29-11-2025 06:33 PM

తంగళ్ళపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల 17వ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న 2013 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ మంచకట్ల అభిలాష్(పిసి–473) నిన్న దురదృష్టకర పరిస్థితుల్లో మృతిచెందారు. ఈ ఘటనతో మొత్తం బెటాలియన్‌లో శోకచాయలు అలుముకున్నాయి. నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేసిన అభిలాష్ మరణం పోలీసులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అధికారులు, సిబ్బంది బెటాలియన్ ప్రధాన కార్యాలయంలో అభిలాష్‌కు ఘనంగా నివాళులు అర్పించారు.

రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. అనంతరం బెటాలియన్ కమాండెంట్ ఎం.ఐ. సురేష్ ఆయన అంత్యక్రియల్లో పాల్గొని, భౌతికకాయానికి పూలమాలలు అర్పించి చివరి శ్రద్ధాంజలి ఘటించారు. తర్వాత అధికారులు, సిబ్బంది ఒక్కొక్కరుగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కమాండెంట్ ఎం.ఐ. సురేష్ మాట్లాడుతూ, అభిలాష్ విధి నిర్వహణలో ఎల్లప్పుడూ ముందుండే విధేయుడు. క్రమశిక్షణ గల, నిబద్ధతతో పనిచేసిన సిబ్బందిలో ఆయన ఒకరు. ఆయన మరణం పోలీస్ శాఖకు తీరని లోటు” అని అన్నారు. తమ సహచరుడిని కోల్పోయిన విషాదంలో 17వ బెటాలియన్ మొత్తం మునిగిపోయింది.