calender_icon.png 15 September, 2025 | 8:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజాభివృద్ధికి ఉపయోగించాలి

15-09-2025 07:01:46 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజ అభివృద్ధి కోసం ఉపయోగించాలని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ సూచించారు. సోమవారం బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. నిరంతర శ్రమ, క్రమశిక్షణ, సమయపాలన ఉంటే విద్యార్థులు తప్పకుండా సాధిస్తారని తెలిపారు.

కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.దేవేందర్ మాట్లాడుతూ... గ్రాడ్యుయేషన్ డే ప్రతి విద్యార్థికి ఎంతో ప్రేరణ ఇస్తుందన్నారు. అనంతరం మైనింగ్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ రంగాల హెచ్ ఓ డి లు విద్యార్థులతో పలు విషయాలను పంచుకున్నారు. అనంతరం టాపర్లకు బంగారు పతకాలతో పాటు ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో హెచ్ఓడి లతోపాటు కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.