calender_icon.png 15 September, 2025 | 8:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితులకు సత్వర న్యాయం: ఎస్పీ కాంతిలాల్ పాటిల్

15-09-2025 06:57:06 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్.పి. కాంతిలాల్ పాటిల్  ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా  ఫిర్యాదుదారుల సమస్యలను విని, వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి ఆర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత  సర్కిల్ ఇన్స్పెక్టర్ లతో  ఫోన్ లో ద్వారా మాట్లాడి సమస్య స్థితిని, పరిష్కారానికి సూచనలు చేశారు.

ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకొనేల, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని  ప్రజా సమస్యలు పై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి  కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నానుని ఎస్పి తెలిపారు.