calender_icon.png 15 September, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిఆర్సి అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి

15-09-2025 07:04:08 PM

డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శంతన్..

నిజామాబాద్ (విజయక్రాంతి): ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రతి ఐదేళ్లకొకసారి జరగవలసిన పే రివిజన్ కమిషన్(Pay Revision Commission) గడువు ముగిసి రెండేళ్లయిన నేటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తక్షణమే పిఆర్సి రిపోర్టు జూలై 2023 నుండి అమలయ్యే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ సభ్యత్వ నమోదులో భాగంగా ఇందలవాయి మండలంలోని వివిధ పాఠశాలలలో ఉపాధ్యాయులను సభ్యులుగా చేర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలలో ఉపాధ్యాయులతో ఏర్పాటైన సమావేశంలో శంతన్ మాట్లాడుతూ గత నెలలో జరిగిన ఉపాధ్యాయుల పదోన్నతులలో చేరని ఉపాధ్యాయుల ఖాళీలలో తక్షణమే పదోన్నతులు కల్పించుటకు షెడ్యూల్ విడుదల చేసి దసరా సెలవులు ముగిసేలోగా పదోన్నతులు కల్పించాలని, ఉపాధ్యాయుల సర్దుబాటు తర్వాత అనేక పాఠశాలలలో ఉపాధ్యాయుల కొరత ఉందని ముఖ్యంగా ఉర్దూ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని ఇట్టి పాఠశాలలలో విద్యా వాలంటీర్లను నియమించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 15 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఉద్యోగులకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ అమలు కొరకు ప్రభుత్వమే ఖర్చు భరించి పరిమితి లేని ఉచిత నాణ్యమైన వైద్యం అందించుటకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, ఉపాధ్యాయులుగా కొనసాగడానికి, పదోన్నతులు పొందడానికి టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) తప్పనిసరిగా పాస్ కావాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొందని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసి 2010 కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష పాస్ కావాలని నిబంధనను తొలగింపజేయాలని, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

జిల్లా ప్రధాన కార్యదర్శి కె. ఒమాజీ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయని వెంటనే డి ఏ జీవోలను విడుదల చేయాలని, ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్యను పరిష్కరించి ఎంఈఓ డిప్యూటీ డిఓ, గ్రేడ్ వన్ ప్రధానోపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసి పర్యవేక్షణ వ్యవస్థ పటిష్ట పరచాలని, పదోన్నతుల ద్వారా భర్తీ చేయవలసిన 5571 పిఎస్ హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలని, జీవో 11,12, ప్రకారం ఎస్జీటీ /ఎల్ పి/పిఇటి లకు  కామన్ సీనియార్టీ ప్రకారం పదోన్నతులు కల్పించాలని, కేజీబీవీ, యు ఆర్ ఎస్, సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ వర్తింప జేయాలని, మోడల్ స్కూల్ గురుకుల సిబ్బందికి 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలని, 317 ద్వారా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులను తమ తమ స్థానిక జిల్లాలకు బదిలీ చేయాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 398 స్పెషల్ టీచర్ల సర్వీస్ కాలానికి ఇంక్రిమెంట్లు ఇచ్చిన ప్రకారం తెలంగాణలో కూడా ఇంక్రి మెంట్లు మంజూరు చేయాలని, అన్ని పాఠశాలలలో జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్, పోస్టులు మంజూరు చేయాలని, రాష్ట్రంలో కేజీ టు పీజీ ఉచిత విద్య అమలకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. డిచ్ పల్లి మండలంలోని జెడ్పీఎస్ఎస్ కమలాపూర్, మిట్టపల్లి, రాంపూర్ డి, ఇందలవాయి మండలo అన్సాన్పల్లి, లోలం, మొదలైన పాఠశాలలను పర్యటించడం జరిగింది. ఇట్టి పర్యటనలో జిల్లా ఉపాధ్యక్షులు రాసరి పెంటన్న, జిల్లా కార్యదర్శి బి. రాందాస్, మండల నాయకులు హకీమ్ లు పాల్గొన్నారు.