10-10-2025 01:17:46 AM
జిల్లావ్యాప్తంగా 1200 పైగా చెరువులు, కుంటలు
బాధ్యతగా ఇప్పటివరకే పంపిణీ చేయాల్సింది :
మానేమోని సత్యనారాయణ, ఉమ్మడి జిల్లా మత్స్యశాఖ సహకార సంఘం మాజీ చైర్మన్, మహబూబ్ నగర్
మహబూబ్ నగర్, అక్టోబర్ 9(విజయక్రాంతి): చేప పిల్లల పంపిణీ ప్రక్రియ ఎటు పాయను అనే పరిస్థితి నెలకొంది. గత ఏడా ది ప్రభుత్వం అప్పుడు ఇప్పుడు అంటూ అక్టోబర్ మాసంలో చేప పిల్లలను పంపిణీ చేసిన ఆశించిన మేరకు ఫలితం లేకుండా పోయిందని మత్స్యకారులు చెబుతున్న మాట.
చెరువులు, కుంటలలో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ చేప పిల్లలు పంపిణీ మాత్రం జరగకపోవడంతో మత్స్యకారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుండ్రు. నిర్లక్ష్యంగా ఉండ కుండా అధికార యంత్రం ఈ విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వెంటనే చె ప్ప పిల్లలను చెరువులలో విడుదల చేయవలసిన అవసరం ఉందని మత్స్యకారులు కోరుతుండ్రు.
- మత్స్యకారుల ఎదురుచూపు....
మత్స్యకారులు చేపల కోసం ఎదురుచూసే పరిస్థితి ఎదురవుతుంది. గత ఏడాది కూడా అక్టోబర్ నెలలో చేప పిల్లల పంపిణీ ప్రక్రియ ప్రారంభించినప్పటికీ పూర్తిస్థాయి లో పంపిణీ జరగలేదని మత్స్యకారులు చె బుతున్న మాట. ఇప్పటికే చెరువులు కుంట లు నిండుకుండ లా మారిన చేప పిల్లల పంపిణీ ప్రక్రియ మాత్రం ప్రారంభం కాలే దు.
జిల్లా వ్యాప్తంగా దాదాపు 1200 పైగా చెరువులు, కుంటలు ఉన్నప్పటికీ చేప పిల్లలు విడుదల కాకపోవడంతో ఇంకా ఎంత సమ యం తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తు న్న దాఖలాలు లేకపోలేదు. ఇప్పటికైనా వెం టనే చేపల పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలని,
ఇది నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి ఎలాంటి ఆ మంత్రాలు లేకుండా చేపల వి డుదల కార్యక్రమం ప్రారంభమైతే సరియైన సమయంలో చేప పిల్లల పెరుగుదల ఉం టుందని మత్స్యకారులు ఆశిస్తున్న మాట. మేరకు సంబంధిత అధికార యంత్రాంగం ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఇంకెప్పుడు పంపిణీ చేస్తారు...విడుదల చేయాలి
వెంటనే చేప పిల్లలను చెరువులలో విడుదల చేయాలి. గత ఏడాది కూడా అక్టోబర్ చాలీచాలనంతగా పంపిణీ చేయడం జరిగింది. ఏడది కూడా ఇప్పటివరకు చేప పిల్లల పంపిణీ ప్రక్రియ ప్రారంభించలేదు. ఇంకెప్పుడు ప్రారంభిస్తారు కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
సరైన సమయంలో చేప పిల్లలను విడుదల చేయకపోతే సరైన సమయంలో చేప పెరగదు. దీంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. వెంటనే ఈ ప్రక్రియను ప్రారంభిస్తారని ఆశిస్తున్నాం.
మనేమోని సత్యనారాయణ, మత్స్య సహకార సంఘం మాజీ చైర్మన్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా