గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి
29-05-2026 12:54 AM
బక్రీద్ వేడుకల్లో ముస్లింల విజ్ఞప్తి
మహబూబాబాద్, మే 28 (విజయక్రాం తి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గోవును జాతీ య జంతువుగా ప్రకటించాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ఈద్గా వద్ద ముస్లింలు ఫ్లెక్సీలు ప్రదర్శించి విజ్ఞప్తి చేశారు. గురువారం బక్రీద్ సందర్భంగా ఈద్గా వద్ద సామూహిక నమాజ్ అనంతరం వారు మాట్లాడుతూ.. గో రక్షణ కోసం కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని, గోవును జాతీయ జంతువుగా ప్రకటించి సం రక్షించాలని కోరారు. గోరక్షణ కోసం సంఘటితంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.






