calender_icon.png 14 July, 2025 | 1:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవితకు తీన్మార్ మల్లన్న క్షమాపణ చెప్పాలి

14-07-2025 02:32:33 AM

మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి 

హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని, వెంటనే తీన్మార్ మల్లన్న కవితకు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి డిమాండ్ చేశారు.

ఆదివారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. మహిళల గౌరవాన్ని కాపాడటం మన సంస్కృతి అని, వ్యక్తిగత దూషణలు, మహిళలను కించపరిచే వ్యాఖ్యలకు రాజకీయాల్లో చోటు లేదన్నారు. బాధ్యతాయు తమైన పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు మాట్లాడే భాష మహిళలను కించపరిచేలా ఉండడం తగదన్నారు. ఆడబిడ్డల గురించి మాట్లాడేటప్పుడు సోయితో మాట్లాడితే మంచిదని మధుసూదనా చారి హితవు పలికారు.