calender_icon.png 27 November, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించిన తహసీల్దార్ రవీందర్ పటేల్

27-11-2025 07:31:24 PM

అంతర్గాం (విజయక్రాంతి): మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి సందర్భంగా తీసుకోవాల్సిన తగు చర్యలు, జాగ్రత్తల గురించి అంతర్గాం మండల తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ గురువారం పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  వివిధ శాఖలకు ఎంపీసీ నియమావళి అమల్లో ఉన్నందున చేపట్టాల్సిన కార్యక్రమాలు సూచనలు అందించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఉద్యోగుల ప్రవర్తన, క్రమశిక్షణకు సంబంధించిన అంశాలు అలాగే మీటింగ్ ర్యాలీలు నిర్వహించుటకు ముందస్తు అనుమతి తీసుకోవాలని, అలాగే ప్రభుత్వ ఆస్తులు కార్యాలయాలు కమ్యూనిటీ సంస్థలు అనగా గుడులు, చర్చిలు, మసీదులు వంటివి వ్యక్తిగత ప్రయోజనాలకు వాడకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా తాసీల్దార్ సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ తూము రవీందర్,  సిడిపిఓ అలేఖ్య పటేల్, నాయబ్ తహసిల్దార్ మల్యాల తిరుపతి , ఎంపీఓ వేణుమాధవ్,  గిరధావర్లు శ్రీమాన్,  రమేష్, హెచ్ సీ  శ్రీనివాస్, పంచాయతీ సెక్రెటరీ, గ్రామ పాలన అధికారులు పాల్గొన్నారు.