calender_icon.png 27 November, 2025 | 8:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరికలు: ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

27-11-2025 07:33:32 PM

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ లో చేరికలు

కోదాడ: కోదాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సమక్షంలో మునగాల మండలం, నేలమర్రి బీఆర్ఎస్ నాయకులు గురువారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు. మాజీ ఎంపీటీసీ కన్మత రెడ్డి వెంకట రామిరెడ్డి ఆధ్వర్యంలో 35 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. బీఆర్ఎస్ నాయకులు గుడిపూడి లక్ష్మయ్య, లక్ష్మీ నారాయణ ,గుడిపూడి రాములు, సైదులు చిలకమర్రి మదనాచారి, జలగం కృష్ణయ్య, బచ్చల కూరి సోములు, గుడిపూడి రామచంద్రయ్య , వెంకన్న, బత్తిని లక్ష్మీ నారాయణ, రామపంగు వెంకన్న , పుట్ట వెంకన్న,నలబోలు వీరారెడ్డిలు కాంగ్రెస్ పార్టీ తీర్దం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, నేలమర్రి గ్రామ శాఖ అధ్యక్షులు సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.