7 August, 2026 | 2:30 AM

ఫోన్‌లో తండ్రికి కడసారి వీడ్కోలు

07-08-2026 12:32 AM
  1. వీడియో కాల్‌లో అంత్యక్రియల వీక్షణ
  2. ముగ్గురు కుమార్తెల ప్రవర్తనపై విమర్శలు
  3. చివరి కోరికగా కళ్లను సైతం దానం చేసిన వృద్ధుడు
  4. హరియాణాలో ఘటన

చండీగఢ్, ఆగస్టు 6: హరియాణాకు చెందిన ఓ వృద్ధుడు వృద్ధాశ్రమంలో మృతి చెందగా, అతని ముగ్గురి కుమార్తెలు దేశంలోనే ఉండి కూడా అంత్యక్రియలు హాజరు కాలేదు. అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ఫోన్ వీడియో కాల్‌లో చివరిచూపు చూసిన తీరు మానవత్వానికి, తల్లిదండ్రుల కన్నప్రమేకు తీరని మచ్చ. ఈ ఘటన కాస్త వార్తా, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో తీవ్ర విమర్శలకు దారితీస్తుంది.

వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన శివచరణ్ రామ్ రతన్ గుప్తా వస్త్ర వ్యాపారి. ఇతను తన జీవితంలో బాగా సంపాదించా డు. ఉన్నంతలో ముగ్గురు ఆడపిల్లలను మం చిగా చదివించి, పెళ్లిళ్లు, పేరంటాలు చేశాడు. అతని వ్యాపారం తీవ్ర నష్టాలపాలైంది. దీం తో తన భార్య మీనాతో కలిసి హరియాణాలోని సోనిపట్‌లో ఉన్న ఒక వృద్ధాశ్రమంలో చేరాడు. రెండేళ్ల క్రితం భార్య మీనా మృతి చెందింది.

జీవిత భాగస్వామి దూరం కావడంతో గుప్తా ఆరోగ్యం కూడా క్షీణిస్తూ మం గళవారం రాత్రి నిద్రలోనే మృతి చెందాడు. బుధవారం ఉదయం గుర్తించిన వృద్ధాశ్రమ నిర్వాహకులు కుమార్తెలకు ఫోన్ చేశారు. నేపాల్, ఉత్తరప్రదేశ్, ముంబైలో ఉన్న కుమార్తెలు కడసారి వీడ్కోలుకు దూరం నుంచి చేరుకోలేక ఆన్‌లైన్‌లోనే తండ్రి దహ న సంస్కారాలను వీక్షించారు.

20 రోజుల క్రితం నుంచి గుప్తా ఆరోగ్యం క్షీణిస్తుండ డంతో కుమార్తెలకు ఫోన్ చేశామని, వారు స్పందించలేదని, ఇక్కడకు రాలేదని ఆశ్రమ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. నేపాల్‌లో ఉన్న కుమార్తె ఆన్‌లైన్ మాధ్యమంగా అంత్యక్రియలకు రూ. 5,100 పంపిందన్నారు. కాగా గుప్తా చివరి కోరికగా అతని కళ్లను దానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. దీంతో కుమార్తెల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.