29-07-2025 10:15:11 PM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామపంచాయతీ రికార్డులను మంగళవారం జిల్లా పంచాయతీ అధికారి యాదగిరి(District Panchayat Officer Yadagiri) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుత వర్షాకాలంలో గ్రామపంచాయతీ పరిధిలో ఎక్కడ కూడా నీటి నిల్వలు ఉండకుండా తగిన చర్యలు చేపట్టాలని, మురికి కాలువల్లో బ్లీచింగ్ పౌడర్ జల్లి అంటువ్యాధులు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పంచాయతీ రికార్డులను సక్రమంగా నిర్వహించాలని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గోపి, పంచాయతీ కార్యదర్శి సుధాకర్ ఉన్నారు.