calender_icon.png 11 January, 2026 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్లోబల్ ‘ఇన్నోవేషన్ క్యాపిటల్‌గా తెలంగాణ

11-01-2026 12:00:00 AM

  1. గేమ్ ఛేంజర్‌గా ఏఐ ఇన్నోవేషన్ హబ్, యూనివర్సిటీ 
  2. టెక్నాలజీ కేవలం డిగ్రీలకే పరిమితం చేయొద్దు
  3. బిట్స్ అల్యూమ్ని అసోసియేషన్ గ్లోబల్ మీట్‌లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 

హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): తెలంగాణను గ్లోబల్ ‘ఇన్నోవేషన్ క్యాపిటల్’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. టెక్నాలజీ కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా, దేశ సేవకు, ఆత్మ నిర్భరతకు ఉపయోగపడాలన్నారు. శనివారం బిట్స్ పిలానీ-హైద రాబాద్ క్యాంపస్‌లో నిర్వహించిన ‘బిట్స్ అల్యూమ్ని అసోసియేషన్ గ్లోబల్ మీట్ 2026’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఇతర దేశాలు ప్రైవేట్ గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహిస్తే, భారత్ మాత్రం ఆధార్, యూపీఐ వంటి ‘డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర ద్వారా ప్రపంచానికి దిక్సూచిగా నిలిచిందన్నారు. దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఏఐ ఆధారిత ‘తెలంగాణ డేటా ఎక్స్ ఛేంజ్ పరిశోధనలకు గొప్ప ఊతమిస్తోందన్నారు. త్వరలో ప్రారంభించబోయే ‘తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ, ‘ఏఐ యూనివర్సిటీ’లు గేమ్ ఛేంజర్‌గా మారి ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తాయన్నారు.

ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ‘ఇంటెలిజెన్స కంటే ‘కో-ఆర్డినేషన్ అత్యంత ఖరీదైనదిగా మారిందన్నారు. ఏఐ వినియోగంలో డేటా ప్రైవసీ, ఎథిక్స్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా ఆర్ అండ్ డీపై దృష్టి సారించాలని టెక్ కంపెనీలను కోరారు. ‘ఏఐ’ ఫలితాలు కేవలం నగరాలకే పరిమితం కాకూడదని, వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లోని గ్రామీణ సమస్యలకు పరిష్కారం చూపేలా పరిశోధనలు జరగాలన్నా రు.

అప్పుడే టెక్నాలజీ ఫలాలు సామాన్యులకు కూడా అందుతాయన్నారు. ‘తెలంగాణ రైజింగలో భాగస్వామ్యం కావాలని బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థులను, యాజమాన్యాన్ని మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు.   కార్యక్రమంలో బిట్స్ అలుమ్ని అసోసియేషన్ ఛైర్ పర్సన్ ప్రేమ్ జైన్, మ్యాప్ మై ఇండియా ఫౌండర్ అండ్ ఛైర్మన్ రాకేష్ వర్మ, బీజీఎం 2026 చైర్ పర్సన్ అనిత తదితరులు పాల్గొన్నారు.