1 August, 2026 | 1:36 AM

వారణాసిలో తెలంగాణ బీజేపీ నేతలు

28-05-2024 01:26 AM

మోదీకి మద్దతుగా ప్రచారం

హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసి, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం కూడా పూర్తవ్వడంతో తెలంగాణ బీజేపీ నేతలు కాశీకి పయనమయ్యారు. కాశీ విశ్వేశ్వరుడి దర్శనంతో పాటు ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో భాగస్వాములయ్యారు. టీబీజేపీ చీఫ్,  కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేఎల్పీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, తదితరులు వారణాసిలో మోదీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. తెలుగు వారు నివసించే ప్రాంతాలో వారు మోదీని గెలిపించాలని కోరారు. హోటళ్లలో తినుబండారాలు విక్రయిస్తూ, ప్రచార సామగ్రి ఇండ్లకు అతికిస్తూ  ఓటర్లను ఆకర్శించేలా ప్రచారం చేపడుతున్నారు.