21 May, 2026 | 3:31 PM

Breaking News

కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. కనీస వేతనాలు పెంపు!   •   తెల్లవారుతుండగానే పల్లెల్లోకి పాఠశాలల ప్రచారం.. విత్తన కంపెనీల ప్రచార రథాలు   •   ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరికి క్రీడలు అవసరం   •   ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి..   •   ఆరోగ్యం బాగుంటేనే జీవితం సార్థకం   •   ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్   •   అనుమతి లేని ప్రైవేట్, విద్యాసంస్థలను మూసివేయాలి   •   కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టెన్త్ టాపర్ కు సైకిల్ బహుకరణ...   •   జైనూర్‌లో చలివేంద్రం – అంబలి పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   బాన్సువాడలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు...   •  

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను కలిసిన తెలంగాణ క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్‌ఉద్యోగులు

14-01-2026 12:34 AM

నిజాంసాగర్ జనవరి 13 (విజయక్రాంతి): తెలంగాణ క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అసోసియేషన్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం షెడ్యూలు కులాల అభివృద్ధి ,గిరిజన సంక్షేమ దివ్యాంగుల, వయోవృద్ధుల సాధికారిక శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను తెలంగాణ సచివాలయంలో మంగళవారం నాడు తెలంగాణ క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలిసి సమస్యలను వివరించారు. గత 15 సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తున్న. తమకు న్యాయం జరగడం లేదని చాలీచాలని వేతనాలతో జీవితాలను కొనసాగిస్తున్నామని తెలపారు.

ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సి ఆర్ పి లకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని ఇట్టి విషయాన్ని మానవత దృక్పథంతో వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు .ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ వీరి సమస్యలు ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకువెళ్లాలని అధికారులకు తెలపడం జరిగింది .ఈ కార్యక్రమంలో టిసిఆర్పిఏ అధ్యక్షులు తిరందాస్.సంతోష్ కుమార్ ,కార్యదర్శి కొత్త కాపు శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ముఖ్య సలహాదారులు బి.శ్రీధర్ కుమార్, కె.భాస్కర్,డి. శరత్ కుమార్, యువరాజు తదితరులు పాల్గొన్నారు.