24-07-2025 10:56:28 AM
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు (BRS Working President KT Rama Rao) కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ తెలంగాణ రాష్ట్రానికి పాటుపడాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. కేటీఆర్ కు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాక్షించారు. తెలంగాణ సీఎంఓ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన సందేశంలో 'సిరిసిల్ల నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.