calender_icon.png 26 July, 2025 | 10:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

24-07-2025 11:37:48 AM

మందమర్రి,(విజయక్రాంతి): మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో(Mahatma Gandhi NREGA) విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని  ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఈద లింగయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు డిఆర్డిఓ పిడి ఎస్ కిషన్ కు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు లింగయ్య మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో జిల్లా వ్యాప్తంగా 155 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తున్నారని వీరికి కనీస వేతనం 26,000 అమలు చేయాలని కోరారు.

ఉపాధి కూలీలకు రోజువారి వేతనం 400 రూపాయలకు పెంచుతూ, ఆర్థిక సంవత్సరంలో 150 రోజులు పనిదినాలు కల్పించాలని, గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ పే స్కేల్ అమలు చేయాలని, ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న అని స్థాయిల ఉద్యోగుల మాదిరిగా ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎఫ్టీఈ లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డులు  మంజూరు చేసి విధి నిర్వహణలో మరణించిన వారికి పది లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా అమలు చేయా లన్నారు.ఎన్ఎంఎంఎస్ ద్వారా అటెండెన్స్ అప్లోడ్(Attendance upload) చేయుటకు గతంలో మాదిరిగా మొబైల్ ఆలవెన్స్ ఇవ్వాలని, అర్హులైన వారిని పంచాయతీ సెక్రెటరీ సహాయకులుగా నియమించాలని కోరారు.