నాచారంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
ఉప్పల్, జూన్ 2 (విజయక్రాంతి): నాచారండివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వి.ఎస్. ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో నాచారం లో ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిరు తెలంగాణ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వి.ఎస్. ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నో త్యాగాలు, ఉద్యమాలు, అమరవీరుల పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, వారి ఆశయాలకు అనుగు ణంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం మరియు సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామ్ రెడ్డి, బి. శ్రీకాంత్ గౌడ్, అశ్వత్థామ రెడ్డి, ఫసియుద్దీన్, సుధాకర్ రెడ్డి, షరీఫుద్దీన్, నరసింగ్ రావు, శ్రీనివాస్ రెడ్డి, రేవంత్, ఫిరోజ్, ఎస్కే ఖయం, నరేష్ ఉమ, విజయమ్మ, యాస్మీ న్, మమత పాల్గొనగా, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్యూఐ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






