calender_icon.png 7 August, 2025 | 4:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్

06-08-2025 10:24:59 PM

ఏరియా జిఎం దుర్గం రాంచందర్..

మణుగూరు (విజయక్రాంతి): ప్రొఫెసర్ జయశంకర్ సార్ సిద్ధాంత కర్తగా, తెలంగాణ ప్రజల గుండెల్లో వేసిన ముద్ర చెరగనిదని, ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన చేసిన సూచనలు సలహాలు భవిష్యత్తు తరాలకు మార్గదర్శకాలని సింగరేణి జిఎం దుర్గం రాంచందర్(Singareni GM Durgam Ramchander) అన్నారు. జిఎం కార్యాలయ సమావేశ మందిరంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆయన జయశంకర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ సిద్ధాంతకర్తగా, ఉద్యమ స్ఫూర్తి ప్రధాతగా తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచి పోయరని, ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న కోసం ‌ చేసిన  కృషిని, ఆయ‌న ధృడ సంక‌ల్పాన్ని తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ  మరచిపోదన్నారు.  ఉద్యమ కారుడి నుండి మహోపాధ్యాయుడి దాకా ఆయన తెలంగాణకు దిక్సూచిగా నిలిచారన్నారు. కార్యక్రమంలో ఎస్.ఓ టు జి ఎం శ్రీనివాస చారి, ఏజిఎం (ఐఈడి) రాంబాబు, రమేశ్ , మధన్ నాయక్ శివ ప్రసాద్,  తిరుపతి,  శ్రీనివాస్,  పర్యావరణ అధికారి శ్రీనివాస్ రావు , ఎస్టేట్స్ అధికారి బాబుల్ రాజ్ పాల్గొన్నారు.