పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ
- పారిశ్రామిక రంగాన్ని ఎల్లవేళలా ప్రోత్సాహం
- హెచ్‌సీసీ బేవరేజెస్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
- పర్యావరణహితంగా హెచ్‌సీసీబీ ఫ్యాక్టరీ: మంత్రి శ్రీధర్‌బాబు
గజ్వేల్, డిసెంబర్2 : పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా, గమ్యస్థానంగా తెలంగా ణ నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడానికి ఎళ్లవేళలా సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు.
సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండతిమ్మాపూర్‌లో హిందుస్థాన్ కోకాకోలా బెవరేజేస్ (హెచ్‌సీసీబీ)కి చెందిన అత్యాధునిక గ్రీన్‌ఫీల్డ్ ఫ్యాక్ట రీని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లా డుతూ.. ప్రపంచ పారిశ్రామిక పెట్టుబడులకు తెలంగాణ ఆకర్షణ శక్తిగా వెలుగొందుతున్నదని చెప్పారు.
రాష్ట్రంలో వ్యాపారాభివృద్ధికి అనుకూల వాతావరణాన్ని సృష్టించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని పునరుద్ఘాటించారు. పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగా ల కల్పనతోపాటు ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు సమగ్ర విధానాలను అనుసరిస్తున్న హెసీసీబీని ఈ సందర్భంగా ముఖ్య మంత్రి అభినందించారు.
హెచ్‌సీసీబీ పర్యావరణహితం : మంత్రి శ్రీధర్‌బాబు
పర్యావరణ హితంగా, పారిశ్రామిక వృద్ధి చేపట్టడానికి బండతిమ్మాపూర్‌లో ఏర్పాటుచేసిన హెచ్‌సీసీబీ పరిశ్రమ మంచి ఉదాహ రణ అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు. అనంతరం మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ మాట్లాడుతూ.. నైపుణ్యం కలిగిన యువత, మహిళలు, గ్రామీణవర్గాల ఉపాధికి ఈ పరిశ్రమ ఎంతో దోహదం చేస్తుం దని అన్నారు.
పునరుత్పాదక ఇందనం, నీటి పునర్వినియోగం వంటి పర్యావరణ అనుకూల అంశాలను పాటిస్తూ పరిశ్రమ కొనసాగడం అభినందనీయమన్నారు. కంపెనీ సీఈవో జువాన్ పాబ్లో రోడ్రిగ్జ్ మాట్లాడుతూ.. హెచ్‌సీసీబీ అభివృద్ధిలో ఇదొక ముఖ్యమైన అడుగు అని, తెలంగాణ అభివృద్ధిలో తమవంతు పాత్రను మరోసారి తెలియజేస్తుందని చెప్పారు.
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని హెచ్‌సీసీబీ పరిశ్రమకు అనుబంధంగా బండతిమ్మా పూర్‌లో 49 ఎకరాల్లో హెచ్‌సీసీబి యూని ట్ 2 ఏర్పాటు చేశామని తెలిపారు. రెండు పరిశ్రమలు కలిపి రూ.3,798 కోట్ల పెట్టుబడులు పెట్టగా, వెయ్యిమందికి ఉద్యోగావకా శం లభించింది.
కార్యక్రమంలో సిద్దిపేట, మెదక్ కలెక్టర్లు మనుచౌదరి, రాహుల్‌రాజ్, టీజీఐఐసీ చైర్మన్ తూర్పు నిర్మలజయప్రకాశ్, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షు డు తూంకుంట నర్సారెడ్డి, పీసీసీ అధికారప్రతినిధి బండారు శ్రీకాంత్‌రావు తదితరులు పాల్గొన్నారు. కాగా, పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు తూంకుంట వర్గానికి ప్రవేశాన్ని నిరాకరించడంతో ఆయ న అభిమానులు ఆందోళన చేశారు.






